ఆరోగ్యానికి పానీయాలు

Healthy Drinks , ఆరోగ్యానికి పానీయాలు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. మనము నిత్యజీవతములో చిన్న చిన్న పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోంటూ ఉంటాము . ప్రతి దానికి డాక్టరు వద్దకు పరుగెత్తుకెళ్ళడం సాధ్యము కాదు . అంత అవసరము కుడా ఉండదు . అలాంటి సమయాల్లో మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఆరోగ్యసమస్యల్ని తేలికగా అధిగమించవచ్చునని అద్యయనము చేసిన నిపునులు సూచిస్తున్నారు .
  • యవ్వనములో అనుభవించిన శృంగార జీవనము మళ్లి కావాలని అనుకునే వాళ్ళు ..... అందుకు అరటిపండుతో తయానుచేసే జ్యూస్ బ్రహ్మాండముగా పనిచేస్తుంది . ఒక కప్పు వెన్నతీసిన పాలు , మరోకప్పు యోగర్ట్ తీసుకుని అందులో ఒక అరటిపండు వేసి బాగా మిశ్రమము చేయాలి . ఇలా తయారుచేసిన ద్రవము నుంచి వచ్చే సువాసన మహిళల్లో మంచి శృంగారా భావనలు పురికొల్పుతాయి. అరటిపళ్ళ నుంచి వెలువడే సౌవాసనల మూలం గా జననేంద్రియాలకు రక్తప్రసరణ అదికం అవుతుంది . తద్వారా బాగా ఉత్తేజము పొందుతుందని అధ్యయనము లో తేలింది .
  • నీరసముగా ఉండి అలసిపొయిన మీరు తిరిగి త్వరగా శక్తి పుంజుకోవడానికి, ఉత్సాహము కలగడానికి నిమ్మరసము బాగాపనిచేస్తుంది ...ఒక అరముక్క నిమ్మపండు రసము ఒక గ్లాసు నీటిలో (250 మి.లీ) తగినంత పంచదార , మధుమేహం గలవారు సుగరు ఫ్రీ పౌడర్ వేసి బాగా కలియబెట్టి త్రాగితే నీరసము , అలసట తగ్గుతుంది . నిమ్మ ముక్కు (నోస్) లో వుండే నరాలను ఉత్తేజపరిచి అలసటను పోగొడుతుంది . మెదడులోని సెన్సర్లు చైతన్యము పొంది శరీరము , మనసు హుసారు పొందుతాయి. నిమ్మ లో ఉండే విటమిన్‌ " సి " యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసి శరీరము లో వ్యర్ధపదార్ధాలు తొలగి పోతాయి .
  • ఉదయాన్నే లెచిన వెంటనే బద్దకము గా అనిపిస్తుంది . ఒక పట్టాన నిద్రమత్తు వదలదు . కాసేపాగి లేదాం అనిపిస్తుంది . వీటిని నివారించాలంటే ఒక కప్పు కాఫీ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు . రోజూ ప్రారంభములోనే నిద్ర మత్తు వదలించి ఉత్తేజము కలిగించే గుణము కాఫీలోని కెఫిన్‌ లో ఉంటుంది . శరీరమంతా ఉన్న నరాల వ్యవస్థ ఉత్తేజము పోంది హాయిగా చురుకుగా ఉండవచ్చు ను . అయితే వెన్నతీసిన పాలనే వాడాలి . తక్కువ చెక్కెర వేసుకోవాలి లేదా సుగరు ఫ్రీ పౌడర్ వాడాలి .
  • పొట్టలో వికారముగా లేదా బరువుగా , ఉబ్బరము గా ఉన్నప్పుడు మనసంతా చికాకుగా మారిపోతుంది . ఏ పనీ చేయాలనిపించదు . ఇలాంటి సమయాలలో అల్లం తో రసము తయారు చేసి తీసుకుంటే ఉపసయనము కలుగుతుంది . .... రోజూ మామూలుగా తాగే టీ లో రెండు అల్లము ముక్కలు వేసి తయారుచేసి త్రాగాలి లేదా గ్లాసు నీళ్ళలో చితకకొట్టిన అల్లము ముక్కలు వేసి బాగా కాచిన తర్వాత ఆ రసాన్ని కొద్దిక పంచదార వేసి తీసుకోవచ్చు . ఇందులో మింట్ కలుపుకోవచ్చును . ఐతే చాతీలో మంటగా ఉంటే మాత్రము మింట్ ను వాడకూడదు . మింట్ ... మంటను అధికము చేస్తుంది .
  • వ్యాయామము చేసిన తరువాత చెమట రూపము ఎలక్ట్రోలైట్స్ బయటికి పోతాయి . శక్తి అవసరము కావున . మధుమేహం లేకుంటే గ్లూకోస్ + నిమ్మ రసము కలిపి త్రాగాలి. తేనె +నిమ్మరసము అయితే మరీ మంచిది . మార్కెట్ లో " ORS డ్రింక్స్ రెడీ గా దొరుకుతాయి అవి త్రాగితే మంచిదే . వెన్న తీసిని పాలను పంచదార తగినంత కలిపి తీసుకోవచ్చు . వీటిలోని ప్రోటీన్లు , కాల్సియం , అనేక పోషకాలు శరీరానికి బాగా ఉపకరిస్తాయి.
  • రోజంతా వివిధ రకాల పనులతో ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పి రావచ్చు . అలాంటి సమయములో యాపిల్ జ్యూస్ తీసుకోవాలి . యాపిల్ లో ఉండే ' యాస్ప్రిన్‌ " వల్ల తలబారము , తలనొప్పి తగ్గుతాయి. యాస్ప్రిన్‌ వలన గుండె జబ్బులు వచ్చే అవకాశము బాగా తగ్గుతుంది .
  • ప్రతి మహిళ రుతుస్రావము సమయము లో నొప్పి, నీరసము అనుభవిస్తుంటారు . ప్రతిరోజూ " ఇన్సులిన్‌ ఆకు " కషాయము తీసుకుంటే చాలా మంచిది . . . ఇన్‌సులిన్‌ మొక్క ఆకులు 4-5 దింటిని ముక్కలుగా చేసి ఒక గాసు (150 మి.లీ) నీటిలో బాగా మరిగించగా వచ్చిన నీటిని పాలు , పంచదార వేసి కాఫీ లా ప్రతిరోజూ తాగితే (మదుమేహం ఉంటే సుగర్ ఫ్రీ పౌడర్ వాడాలి ) రుతుస్రావ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి .
  • అప్పుడప్పుడు ఏదీ జ్ఞాపకము ఉండడం లేదని చెప్పే వయసు మల్లినవారు రోజూ " గ్రీన్‌ టీ " తాగితే బాగా ఉపయోగపడుతుంది . దీనిలోని అనేక యాంటి ఆక్షిడెంట్స్ ఆరొగ్యాన్ని కాపాడి మెదడును చురుకుగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి .
  • నిద్ర రావడనికి మాత్రలు వాడేకంటే ... పడుకునే ముండు వెచ్చటి పాలు తీసుకుంటే ప్రయోజము ఉంటుంది . పాలు నిద్రకు ఉపయోగపడే " ట్రిప్టోఫాన్స్ " లను ఉత్తేజపరుస్తుంది .

No comments:

Post a Comment